- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Insurance Policy: ఇన్సూరెన్స్ పాలసీలపై సైబర్ రాక్షసుల వల.. చిక్కితే విలవిల!

దిశ, వెబ్‌డెస్క్: Insurance Policy: టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో..అంతే వేగంగా ఆర్థిక మోసాలు కూడా పెరిగాయి. వీటి వల్ల మోసపోయేది సామాన్యులే. ప్రస్తుతం నేటి ప్రపంచంలో ఎన్నో రకాల మోసాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. దీని వల్ల ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు రెండు నిమిషాల్లోనే మాయమవుతుంది. మీ ఫోన్ కు ఇన్సూరెన్స్ పాలసీ( Insurance Policy)లు, రెన్యువల్ పేరుతో మెసేజ్ లు వస్తున్నాయా. ఫోన్, కాల్స్, లింక్స్ వస్తున్నాయా?. అయితే జాగ్రత్త పడాల్సిందే. ఇది సైబర్ దొంగల(Cyber criminals) పనికావచ్చు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా..వాటికి స్పందించారో..మీ పని ఖతం.
పార్ట్ టైం ఉద్యోగుల పేరుతో గృహిణులు, నిరుద్యోగులను, అధిక వడ్డీల ఆశ చూపి ఉద్యోగులను, పెట్టుబడిదారులను, యాత్రలు, రాయితీలని చెప్పి వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగుస్తులను నట్టేట ముంచుతున్న సైబర్ నేరస్తులు, బీమారంగం(Insurance sector)పై వల విసురుతున్నారు. ఆశలు చూపి నిలువెల్లా మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం ఆలోచించకుండా స్పందించినట్లయితే నిండా మునిగిపోయినట్లే. బహుమతులు, ఉద్యోగాలు, బీమా బదలాయింపులు, సాంకేతిక సమస్యల సాకుతో, రెన్యువల్(Renewal) పేరుతో సైబర్ మోసగాళ్లు వల విసురుతున్నారు. ప్రముఖ బీమా కంపెనీల పేర్లతో ఫేక్ ఈ మెయిల్స్, మెసేజ్ లు పంపిస్తున్నారు. వీటి ద్వారా డబ్బులు కొల్లగొడుతున్న సంఘటనలుఈ మధ్య కాలంలో పెరిగిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులు(Cybercrime police) తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది విద్యావంతులు, వృద్ధులు ఉన్నారు.
బీమా వివరాలు, వాటి గడువు, ఇతరత్రా సమాచారంతో ఇటు పాలసీదారులకు, అటు పాలసీ సంస్థలకు మాత్రమే తెలుస్తాయి. సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తిగత సమాచారాన్ని అడ్డదారుల్లో కొంటున్నారు. డేటా ప్రొవైడర్లు(Data providers), బ్రోకింగ్ కంపెనీలు(Broking companies) రూ. 10వేలు ఇస్తే లక్షలాదిమంది పాలసీదారుల వివరాలను అందిస్తున్నాయి. ఇందులో పాలసీ వివరాలు, వాటి గడువు, వాహనాల నెంబర్లు, వాటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా పూర్తిగా పర్సనల్ డేటా ఉంటుంది. ఈ సమాచారంతో సైబర్ నేరగాళ్లు పాలసీ దారులకు ఫోన్లు, మెసేజ్ లు పంపుతూ కొత్త బీమా, రెన్యూవల్ తో అధిక లాభాలు, బహుమతులు అందుకోవచ్చని ఆశ చూపుతున్నారు. నమ్మించి బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. ఏమరపాటు ఉంటే ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
-ULIP పాలసీలు కానీ TERM పాలసీలు కానీ బీమా ఏజెంట్ వద్ద మాత్రమే కొనుక్కోండి.
- రెన్యువల్, పాలసీ బదలాయింపు పేరుతో వచ్చే ఈ మెయిల్స్ , మెసేజ్ లను నమ్మకూడదు.
-ప్రస్తుతం ఉన్న బీమా పాలసీకి బదులుగా కొత్తది తీసుకుంటే అధిక లాభాలు వస్తాయని చెప్పే మాటలను మీరు గ్రహించండి.
-ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ కోసమని చెప్పి పాన్, ఆధార్ నెంబర్లు, బ్యాంకు వివరాలు అడిగితే అది సైబర్ మోసమని గుర్తించండి.
ఎల్ఐసీ జారీ నోటిసు:
ఎల్ఐసీ ఇండియా యాప్ అని చూపించే ఫేక్ యాప్ ను మీరు ఉపయోగిస్తే లేదా చూసిన తమకు సమాచారం అందించాలని ఎల్ఐసీ ఇటీవల నోటీసు జారీ చేసింది. ఎల్ఐసీ పేరుతో కనిపించే ఇలాంటి యాస్స్ నిజం కాదు తెలిపింది. దీని వల్ల డబ్బును కోల్పోయే అవకాశం ఉందని..ఇలాంటి మొబైల్ యాప్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది. దీంతోపాటు మీ అన్ని ట్రాన్సాక్షన్స్ ఎల్ఐసీ అఫీషియల్ వెబ్ సైట్ సహాయంతో మాత్రమే చేయాలని లేదా డబ్బును ఎల్ఐసీ డిజిటల్ యాప్ ద్వారా ట్రాన్స్ క్షన్ చేయాలని సూచించింది.