- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘బట్టలూడదీసి కొడతా’పై భగ్గుమన్న ఎమ్మెల్సీ

దిశ, మేడ్చల్ బ్యూరో : ఫార్మసిటీ, ఫ్యూచర్ సిటీ భూసేకరణ అంశంలో పెద్దల సభలో మంగళవారం స్వల్ప వాగ్వాదానికి దారి తీసింది. ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రశ్నోత్తరాల సమయంలో ఫ్యూచర్ సిటీ అంశంపై మాట్లాడుతూ అది ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ ప్రస్తావించారు. దీనికి అక్కడే ఉన్న మంత్రి శ్రీధర్ బాబు అడ్డుపడటంతో సభాధ్యక్షుడు కలుగజేసుకొని మీరు వేరే సభలోని ప్రస్తావన ఇక్కడ తీసుకురావద్దు అని అన్నారు.
దాంతో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ఘాటుగా స్పందించారు. నిండు సభలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి బట్టలూడదీసి కొడతా అంటే ఏ ఒక్కరూ స్పందించలేదని, ఇక్కడ మాత్రం బయట వినిపిస్తున్న ‘ఫోర్ బ్రదర్స్ సిటీ’అంశం ప్రస్తావించగానే అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. చట్టం అధికార పక్షానికి చుట్టంగా మారిందని, అధికార పక్షానికి ఒక రూల్, ప్రతిపక్షానికి మరొక రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు.
ఫ్యూచర్ సిటీ భూసేకరణపై ప్రశ్న..
కొద్దిసేపు గందరగోళం అనంతరం ఎమ్మెల్సీ సంబిపూర్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో ఎంత మేర భూసేకరణ జరిగిందని, ఎంతమంది రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రశ్నించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు సమాధానమిస్తూ ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీ అంశంలో ఎటువంటి భూసేకరణ చేయలేదని, చేసే సందర్భంలో నిబంధనలకు అనుగుణంగానే చేసి రైతులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.