యాదగిరిగుట్టలో మిస్ యూనివర్స్ సందడి..

by Sumithra |
యాదగిరిగుట్టలో మిస్ యూనివర్స్ సందడి..
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మిస్ యూనివర్స్ విక్టోరియా క్జార్ థెయిల్విగ్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు‌. దర్శనం అనంతరం శ్రీ స్వామి వారి ఫోటో, ప్రసాదాన్ని అందజేశారు.‌ ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ విశిష్టతను, ఆలయ సాంప్రదాయంతో పాటు పలు వివరాలను విక్టోరియా క్జార్ థెయిల్విగ్ ఈవోను అడిగి తెలుసుకున్నారు. ఈవో భాస్కరరావు ఆలయ విశిష్టతను ఆమెకు వివరించారు. విక్టోరియా క్జార్ థెయిల్విగ్ అఖండ దీపారాధన చేశారు.‌ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయ సందర్శన అనిర్వచనీయమని పేర్కొన్నారు.

Next Story

Most Viewed