చిన్నోళ్ళు సరే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హీరో, హీరోయిన్స్‌పై కేసులు పెట్టరా? నెటిజన్స్

by Ramesh N |   ( Updated:2025-03-18 10:16:58.0  )
చిన్నోళ్ళు సరే.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హీరో, హీరోయిన్స్‌పై కేసులు పెట్టరా? నెటిజన్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Betting Apps) బెట్టింగ్‌, రమ్మీ, గేమింగ్‌ యాప్స్‌ ఉచ్చులో యువత చిక్కుకుపోతున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ బారిన పడిన యువత ఆర్థికంగా నష్టపోవడం, ఆత్మహత్యలకు పాల్పడుతున్న కేసులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే సోషల్‌ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులు 11 మందిపై కేసులు పెట్టిన విషయం హాట్ టాపిక్‌గా మారింది. హర్ష సాయి, ఆర్టిస్ట్ సురేఖా వాణి కుమార్తె సుప్రీత, విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజ, ఇమ్రాన్‌ ఖాన్‌, అజయ్, భయ్యా సన్నీ యాదవ్, సుదీర్ రాజు, కిరణ్ గౌడ్‌లపై పంజాగుట్ట స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

అయితే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన చిన్నోళ్లపై కేసులు పెట్టారు.. సరే మరి పెద్ద సెలబ్రిటీలు కూడా కేసులు ఎందుకు పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. గతంలో పలువురు హీరోలు, హీరోయిన్స్ రమ్మీ, గేమింగ్‌ లాంటి యాప్స్‌‌ను ప్రమోట్ చేసిన వీడియోలు తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో జీత్‌విన్ అనే గేమ్ యాప్ తెలుగు హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రమోట్ చేస్తోంది. అదే విధంగా రమ్మీ, గేమింగ్‌ యాడ్‌లో నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో రానా, నటి మంచులక్ష్మీ నటించిన వీడియోలు సైతం నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. కొందరు క్రికెటర్లు డ్రీమ్ 11 లాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని, బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేసిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్‌కు నెటిజన్లు రిక్వెస్ట్‌లు చేస్తున్నారు.

భారత చట్టాలు సామాన్యులకేనా అనేది ఈ #SayNoToBettingApps ఉద్యమం ద్వారా తెలిసిపోతుందని ఓ నెటిజన్ పోస్ట్ ఆసక్తిగా మారింది. కాగా, గేమింగ్ యాప్స్ కొన్ని స్కిల్డ్ గేమ్స్ కింద వస్తుందని, పైగా కొందరు యాడ్స్‌లో డబ్బులు సంపాదించండని ప్రచారం చేయరని నెట్టింట చర్చ జరుగుతోంది.


Read More..

బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ పై కేసు నమోదు

తెలంగాణ పోలీసుల దూకుడు.. 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు

Next Story

Most Viewed