- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోప్ వే తో రయ్.. రయ్..

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : చారిత్రాత్మక భువనగిరి ఖిల్లాకు మహర్దశ చేకూరింది. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే పర్యాటకుల కోరిక నేరవేరనుంది. స్వదేశీ దర్శన్ 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా భువనగిరి ఖిల్లాతో అభివృద్ధి చెందనుంది. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఈ కోటను రూ.56.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ తాజాగా టెండర్లు పిలిచింది. ఖిల్లాకు రూప్ వే ద్వారా భువనగిరి అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇలా జరిగితే ఈ ప్రాంత రూపురేఖలు మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
మారనున్న రూపురేఖలు..
ఇప్పటికే పర్వతారోహణ శిక్షణలో ప్రసిద్ధి చెందిన భువనగిరి ఖిల్లా భవిష్యత్తులో అంతర్జాతీయ పర్వతారోహణ శిక్షణా కేంద్రంగా మారనుంది. భువనగిరి ఖిల్లాకు సముద్ర మట్టానికి 600 అడుగుల ఎత్తులో అండాకారంలో ఏకశిలా పర్వతంగా పేరుంది. క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 1900 శతాబ్దం వరకు పలు రాజవంశాల పాలనకు వేదికగా ఉండి, పలు చారిత్రక కట్టడాలకు నెలవుగా ఉన్న రానున్న రోజుల్లో అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారనుంది. ఖిల్లా వేదికగా రోప్‌వే, లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ప్రాజెక్ట్, పర్వతారోహణ, సాహస క్రీడలు, ట్రెక్రింగ్, పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు, హరితవనాలతో ఖిల్లాను తీర్చిదిద్దనున్నారు.
పర్యాటకులకు చక్కటి ప్రయాణ అనుభూతి..
భువనగిరి ఖిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్ - వరంగల్ 165వ జాతీయ రహదారి నుంచి ఖిల్లా వరకు కిలోమీటరు దూరం వరకు రోప్ వే ఏర్పాటు అవనుంది. రాష్ట్రంలో తొలి రోప్ వేగా భువనగిరి ఖిల్లా చరిత్రలో నిలిచిపోనుంది. భువనగిరి ఖిల్లా మీదికి రోప్ వే ఏర్పాటు చేయడం వలన పర్యాటకులకు మంచి ప్రయాణ అనుభూతిని ఇస్తుంది. ఖిల్లా పైకి రోప్ ఏర్పాటుతో పాటు కోట పై ఉన్న నీటి కొలను, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ప్రవేశద్వారం, రోడ్లు పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు.
ప్రాజెక్టు వ్యయం..
ఖిల్లాపైకి రోప్ వే ఏర్పాటు చేయడానికి రూ.15.20 కోట్లు 30 మీటర్ల వెడల్పుతో యాక్సెస్డ్ రోడ్డు పార్కింగ్ రూ. 10.73 కోట్లు, కోట ప్రవేశద్వారం, టూరిజం సదుపాయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు రూ.10.37 కోట్లు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9.40 కోట్లు, ఇతరత్రా ఏర్పాట్లకు రూ.11.11 కోట్లు చేసింది.