- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SA10: బిగ్ షాకిచ్చిన అక్కినేని హీరో.. ఇదెక్కడి మాస్ రా మావ అంటున్న ఫ్యాన్స్

దిశ, సినిమా: యంగ్ హీరో సుశాంత్ (Sushant) అందరికి సుపరిచితమే. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో.. కాళిదాసు సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత వచ్చిన ‘కరెంట్’ మూవీతో నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ, హీరోగా అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. అలాగే.. 2021లో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ.. ఆ మూవీ కూడా అంతగా కలిసి రాలేదు. దీంతో ‘అల వైకుంఠపురములో (Ala Vaikunthapuramulo), రావణాసురుడు (Ravanasuradu), ‘భోలా శంకర్’ (Bhola Shankar) వంటి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్‌లో మెరిశాడు. మళ్లీ ఇన్నాళ్లకు హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశాడు.
సుశాంత్ హీరోగా ‘SA10’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి త్విరాజ్ చిట్టేటి (Twiraj Chitteti) దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. భయంకరమైన చీకటి వాతవరణం కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో సుశాంత్ టూ షేడ్స్‌లో కనిపించి బిగ్ షాక్ ఇచ్చాడు. ఇందులో సుశాంత్ పాత్ర ఓ మిస్టీరియస్‌గా ఆకట్టుకుంటోంది. దీంతో ఈ పోస్టర్ కాస్త వైరల్ కావడంతో.. ‘ఇదెక్కడి మాస్ రా మావ.. ఈసారి హిట్ కొడతావు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
#SA10 - Sushanth In An Exorcist Role!!! pic.twitter.com/9CL5igxLst
— Aakashavaani (@TheAakashavaani) March 18, 2025