Bomb Threats : రెండు కలెక్టరేట్లకు బాంబు బెదిరింపులు

by M.Rajitha |
Bomb Threats : రెండు కలెక్టరేట్లకు బాంబు బెదిరింపులు
X

దిశ, వెబ్ డెస్క్ : కేరళ(Kerala)లో బాంబు బెదిరింపుల(Bomb Threats) కలకలం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రెండు జిల్లా కలెక్టరేట్లకు ఈ బెదిరింపులు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. మంగళవారం ఉదయం 6.48 గంటలకు ఆఫీసులో బాంబు పెట్టినట్టు, మరికాసేపట్లో ఆది పేలబోతున్నట్టు పథనంథిట్ట(Pathanamthitta) కలెక్టర్ అధికారిక మెయిల్ ఐడీకి ఒ మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించగా.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీలు కొనసాగుతుండగానే.. తిరువనంతపురం(Tiruvananthapuram) కలెక్టరేట్ కు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్ పంపించారు దుండగులు. రెండు చోట్లా భద్రతా బలగాలు రంగలోకి దిగి తనిఖీలు చేపట్టగా.. పథనంథిట్ట కలెక్టరేట్ లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలియ జేశారు. తిరువనంతపురంలో మాత్రం ఇంకా బాంబు సోదాలు కొనసాగుతున్నాయని సమాచారం. కాగా మెసేజ్ పంపిన మెయిల్ ఐడీపై విచారణ చేస్తున్నామని, దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed