జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్లా లేనట్లా?

by Kalyani |
జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్లా లేనట్లా?
X

దిశ ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లా కేంద్రమైన ఖమ్మంలో పుట్టగొడుగుల్ల రోజుకొక హోటల్, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు పుట్టుకొస్తున్నప్పటికీ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనకేమి సంబంధం లేనట్లు వ్యవహరించడంపై జిల్లాలో సర్వత్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అసలు హోటల్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, కర్రీ పాయింట్లపై తనిఖీలు చేపట్టక పోగా ఎక్కడికి అక్కడ మామూళ్ల మత్తులో జోగుతూ విధులు నిర్వహిస్తున్నట్టు నటించడం తప్ప ప్రభుత్వానికి ఆదాయం చూపించడంలో తన పాత్ర ఏమీ లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. అసలు జిల్లా కి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటే ఒక్కసారి అయినా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, కర్రీ ప్యాంట్లు పర్యవేక్షణ చేసి పరిశీలన లోపం ఉంటే వారికి నిబంధనల ప్రకారం వారికి దండన విధించాలి.

కానీ అందుకు విరుద్ధంగా జిల్లాలో పలు హోటళ్లు పెద్ద పెద్ద రెస్టారెంట్ లో, బిర్యాని సెంటర్ ల వద్ద తన మనిషిని పెట్టుకుని వసూళ్ల పర్వం మొదలుపెట్టినట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా గట్టిగా అడిగితే తన ఆరోగ్యం బాగోలేదని పలుమార్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కెళ్ళి డయాలసిస్ చేయించుకుంటున్నట్లు చెప్పడం ఆయనకు పరిపాటి. ఖమ్మం నగరం కేంద్రంగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్టులు తయారు చేస్తున్నప్పటికీ తనకు సమాచారం ఉన్నప్పటికీ కూడా వారి వద్దకు వెళ్లకుండా వారిని ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఆ అధికారిపై చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికారులు స్పందించడంలో విఫలమయ్యారని పలువురు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ కూడా తనిఖీలు చేసి ప్రభుత్వానికి ఆదాయం చూపించిన దాఖలాలు లేవని చెప్పవచ్చు.

ఒక హోటల్లో శాంపిల్స్ తీసి కనీసం ప్రభుత్వానికి ఆదాయం చూపించిన దాఖలు ఎక్కడైన ఉన్నాయి అంటే చీకట్లో కూడా వెతికి చూపించవచ్చు. అలాంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ విధి ఉన్నప్పుడే నిధి వెనకేసుకోవాలనే నానుడి సామెతను తనకు తాను నిరూపించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ సైతం ఫుడ్ ఇన్స్పెక్టర్ పై తన చూపు లేకపోవడంతోనే తనకేమి కాదన్నట్లు వ్యవహరించడం పెద్ద హోటల్లో రెస్టారెంట్లు బిర్యానీ సెంటర్ల నుండి తనకు రావలసిన కమిషన్లను మన జేబులో వేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని పలువురు ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు.

ప్రజా సంఘాలు, ప్రైవేట్ కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫోన్ చేసి వారికి కావలసిన భోజన సౌకర్యాలు కల్పించుకోవడం లో ఉన్న భద్రత ప్రజల ప్రాణాల మీద ఎందుకు లేదని ఇప్పటికే ఎన్నో హోటల్లో, రెస్టారెంట్లలో ఈగలు దోమలు బొద్దింకలు తినే సమయంలో వచ్చినప్పుడు కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా కనీసం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆ హోటల్కు, రెస్టారెంట్లకు వచ్చిన సందర్భాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న జిల్లా అధికారులకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పనితీరు తెలియక పోవడంలో వారికి కూడా దీంట్లో సంబంధం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నత అధికారులు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పని తీరుపై దృష్టి పెట్టాలని హోటల్లు రెస్టారెంట్ లో తినే ఆహారంపై ప్రజలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Next Story