Today Weather Update: ఏపీ, తెలంగాణ వాతావరణం అప్డేట్..?

by Anjali |
Today Weather Update: ఏపీ, తెలంగాణ వాతావరణం అప్డేట్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు లేవు. గత పది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. సూర్య కిరణాలు డైరెక్టుగా భూమిపై పడుతున్నాయి. నేల వేడెక్కి.. రాత్రిళ్లు కూడా వేడిగానే ఉంటోంది. దీనికి తోడుగా వడగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని.. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఇవాళ వాతావరణం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. రెండు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఎక్కడా కూడా మేఘాలు వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అందువల్ల ఇవాళ రెండు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే .. గరిష్ఠ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం.. 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story