- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిపక్ష నేతలపైనే 95శాతం కేసులు: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర దర్యాప్తు సంస్ధలు నమోదు చేసిన కేసుల్లో 95శాతం ప్రతిపక్ష నేతల పైనే ఉన్నాయని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియాసూలే అన్నారు. దర్యాప్తు సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన సుప్రియా.. అంతిమంగా నిజమే గెలుస్తుందని తెలిపారు. ముంబైలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది. ఇది పోరాట కాలం. భవిష్యత్తులో సవాళ్లు ఉంటాయి, కానీ ఎన్సీపీ వాటిని అధిగమించి పోరాడుతుంది. సత్య మార్గంలో పయనిస్తూనే ఉంటాం’ అని అన్నారు. మనీలాండరింగ్ విచారణకు సంబంధించి ఎన్సీపీ నేత రోహిత్ పవార్ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే సుప్రియా సూలే పై వ్యాఖ్యలు చేశారు. ‘రైతులు, యువత ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రోహిత్ ఇటీవల సంఘర్ష్ యాత్ర చేపట్టారు. దీనికి భారీ స్పందన లభిస్తోంది. అందుకే రాజకీయంగా దెబ్బ తీసే ఉద్దేశంతోనే ఇబ్బంది పెడుతున్నారు’ అని తెలిపారు.