సీబీఐ దర్యాప్తు అంగీకారాన్ని ఉపసంహరించుకున్న తొమ్మిది రాష్ట్రాలు..

by Vinod kumar |
సీబీఐ దర్యాప్తు అంగీకారాన్ని ఉపసంహరించుకున్న తొమ్మిది రాష్ట్రాలు..
X

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు మొత్తం తొమ్మిది రాష్ట్రాలు సీబీఐ దర్యాప్తు అంగీకారాన్ని ఉపసంహరించుకున్నాయని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అంటే అనుమతి లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఆయా రాష్ట్రాల్లో ఇకనుంచి ఎటువంటి దర్యాప్తూ చేపట్టకూడదు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎస్‌పిఈ) చట్టం 1946లోని సెక్షన్ 6 ప్రకారం.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తన అధికార పరిధిలో దర్యాప్తు జరపడానికి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి అవసరమని ఆయన రాజ్యసభకు వ్రాతపూర్వక సమాధానం ద్వారా తెలియజేశారు.

డీఎస్‌పిఈ చట్టం 1946లోని సెక్షన్ 6 నిబంధనల ప్రకారం నిర్దిష్ట వర్గాలకు వ్యతిరేకంగా.. నిర్దిష్ట తరగతి నేరాల దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐకి సాధారణ అనుమతిని మంజూరు చేశాయని మంత్రి సింగ్ అన్నారు. సీబీఐకి అనుమతిని ఉపసంహరించుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరం, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed