యూఎస్‌లో ఘోర ప్రమాదం.. ఆర్మీ హెలికాప్టర్లు ఢీ

by Vinod kumar |
యూఎస్‌లో ఘోర ప్రమాదం.. ఆర్మీ హెలికాప్టర్లు ఢీ
X

న్యూయార్క్: యూఎస్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రెయినింగ్ మిషన్లో ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు ఢీకొని కుప్పకూలిన ఘటనలో 9 మంది సైనికులు మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అంథోని హోఫ్లర్ తెలిపారు. రోటిన్ ట్రెయినింగ్‌లో భాగంగా చేస్తున్న ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. వీరు నైట్ విజన్ కళ్లజోడు ఉపయోగించి మిషన్‌లో పాల్గొన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన స్థలంలో లభించిన భ్లాక్ బాక్స్‌ల ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story