- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wayanad Landslide : జలవిలయం.. 84కి చేరిన మృతుల సంఖ్య
దిశ, నేషనల్ బ్యూరో: వయనాడ్ జలవిలయంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 84 మంది చనిపోయారు. 116 మంది గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. కాగా.. వయనాడ్ లో సహాయక చర్యలు ముందుకు సాగే కొద్దీ ఆందోళన కలిగించే విషయాలు బయటకొస్తున్నాయి. అయితే, 600 మంది వలస కార్మికుల ఆచూకీ గల్లంతైంది. అంతేకాకుండా, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడంతో సమస్యను మరింత తీవ్రంగా మారింది. ముండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అసోం నుంచి వందలాది మంది కార్మికులు వస్తుంటారు. ముండకైలోని హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్‌లో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా స్థానికంగా నివాసం ఉంటున్నారు. తాజాగా కంపెనీ జనరల్ మేనేజర్ బెనిల్ జోన్స్ మాట్లాడతూ.. ‘‘ కార్మికులతో ఇప్పటి వరకు సంప్రదించలేకపోయాం. మొబైల్ నెట్ వర్క్ కూడా పనిచేయట్లేదు” అని భయపడుతున్నారు. సహాయకచర్యల కోసం నేవీకి చెందిన 30 మంది గజఈతగాళ్లను రప్పించారు. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ కు చెందిన 2 హెలికాప్టర్లు, ఆర్మీకి చెందిన 200 మంది సిబ్బంది కూడా సహాయకచర్యల్లో నిమగ్నమయ్యారు.
- Tags
- wayanad