GST: బీమా ప్రియమంపై జీఎస్టీతో రూ.8,263 కోట్ల ఇన్ కమ్

by Prasad Jukanti |
GST: బీమా ప్రియమంపై జీఎస్టీతో రూ.8,263 కోట్ల ఇన్ కమ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీవిత, ఆరోగ్య బీమా పాలసీల విధించిన జీఎస్టీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తాజాగా కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీమా ప్రీమియంపై జీఎస్టీతో కేంద్ర ప్రభుత్వానికి రూ. 8,263 కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. సోమవారం లోక్ సభలో ఈ వివరాలు వెల్లడించారు. హెల్త్, టర్మ్ పాలసీల ప్రీమియాలపై జీఎస్టీని తగ్గించాలని, తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తులు వచ్చినట్లు సభలో వెల్లడించారు.

గడ్కరీ లేఖతో మరోసారి చర్చకు:

జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి గడ్కరీ విజ్ఞప్తి చేస్తూ లేఖను రాశారు. బీమా రంగానికి సంబంధించిన అంశాలపై గడ్కరీకి నాగ్ పూర్ డివిజన్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గడ్కరీ విజ్ఞప్తితో పాలసీలకు విధించిన జీఎస్టీ విషయం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story