- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heart Attack : గుండెపోటుకు ఇద్దరు బాలలు బలి.. ఆడుకుంటుండగా హార్ట్ ఎటాక్స్
దిశ, నేషనల్ బ్యూరో : సడెన్‌గా వచ్చే హార్ట్ ఎటాక్‌లు(Heart Attack) దడ పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్(UP)లోని అలీగఢ్ జిల్లా(Aligarh district)లో గుండెపోటుతో ఇద్దరు బాలలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబాలను విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. అలీగఢ్ జిల్లాలోని లోధీ నగర్‌లో ఉన్న గ్రీన్ వ్యాలీ కాన్వెంట్ పబ్లిక్ స్కూలులో దీక్ష మూడో తరగతి చదువుతోంది. ఆమె వయసు ఎనిమిదేళ్లు. శనివారం సాయంత్రం తమ ఇంట్లో ఆడుకుంటుండగా దీక్షకు అకస్మాత్తుగా ఛాతీనొప్పి వచ్చింది. దీంతో ఆమె అరవడం మొదలుపెట్టింది. నోటి నుంచి నురగ రాసాగింది. కాసేపటికే దీక్ష స్పృహ కోల్పోయింది. ఏదైనా పురుగు కుట్టి ఉండొచ్చని దీక్ష కుటుంబ సభ్యులు భావించారు. ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన డాక్టర్.. అప్పటికే దీక్ష చనిపోయిందని చెప్పారు. ఆమెకు హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహిస్తామని పోలీసులు ముందుకు వచ్చినా.. దీక్ష పేరెంట్స్ అందుకు నిరాకరించారు.
రన్నింగ్ కాంపిటీషన్స్ కోసం..
మోహిత్ చౌదరి వయసు 14 ఏళ్లు. అలీగఢ్ జిల్లాలోని ఛర్రా ఏరియా వాస్తవ్యుడు. డిసెంబరు 7న జరగాల్సిన రన్నింగ్ కాంపిటీషన్స్ కోసం మోహిత్ సహా ఎంతోమంది విద్యార్థులకు స్కూలులో ప్రాక్టీస్ చేయిస్తున్నారు. ఇందులో భాగంగా స్కూలు గ్రౌండులో తోటి స్నేహితులతో కలిసి మోహిత్ రెండు రౌండ్లు పరుగెత్తాడు. అనంతరం అతడు పరుగెత్తే క్రమంలో నేలపై కుప్పకూలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. మోహిత్‌ను పరీక్షించిన డాక్టర్లు.. అతడు చనిపోయాడని తెలిపారు. గత శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గత నెలలో అలీగఢ్ జిల్లాలోని అర్రానా గ్రామంలో మమత అనే 20 ఏళ్ల యువతి రన్నింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె చనిపోయింది.