Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ కేసు.. ఏడుగురు అధికారులపై వేటు

by Shamantha N |   ( Updated:2024-08-26 14:08:00.0  )
Actor Darshan: కన్నడ నటుడు దర్శన్ కేసు.. ఏడుగురు అధికారులపై వేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: కన్నడ నటుడు దర్శన్‌ పోలీసుల కస్టడీలో ఉన్నప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ పొందుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు వేసింది. దీనిపై విచారణ ప్రారంభించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. దర్శన్‌ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ తర్వాత ఈ కేసులో ఏడుగురికి ప్రమేయం ఉన్నట్లు తెలిసిందన్నారు. జైల్లోని సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేపట్టిన తర్వాతే అధికారులను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే, జైలులో దర్శన్‌కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుందని వెల్లడించారు. ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్‌ ఎపిసోడ్‌పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు.

అభిమాని హత్య కేసులో..

అభిమాని హత్య కేసులో దర్శన్‌ బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. అయితే, విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ కు వీఐపీ ట్రీట్మెంట్ వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు వస్తున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది.

Advertisement

Next Story

Most Viewed