సూరత్ లో భవనం కూలిన ఘటనలో ఏడుకి చేరిన మృతుల సంఖ్య

by Shamantha N |
సూరత్ లో భవనం కూలిన ఘటనలో ఏడుకి చేరిన మృతుల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని సూరత్‌లో ఆరంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. గత కొన్నిరోజులుగా వర్షం కురుస్తుండగా.. సచిన్ పాలి గ్రామంలోని ఆరంతస్తుల భవనం కూలిపోయింది. రాత్రంతా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిందని.. ఏడు మృతదేహాలను వెలికితీశామని చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. దాదాపు 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వారందరూ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్నట్లు వెల్లడించారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే?

శనివారం మధ్యాహ్నం సచిన్ పాలి గ్రామంలో ఆరంతుస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. రెస్క్యూ టీమ్ రాత్రంతా శిథిలాలను తొలగిస్తూనే ఉంది. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానికులు మాట్లాడుతూ.. సూరత్‌లో శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed