- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Delhi Air Pollution: ఢిల్లీలో 70 శాతం కుటుంబాల్లో ఆరోగ్య సమస్యలు
దిశ, నేషనల్: మన దేశంలో అత్యధికంగా వాయు కాలుష్యం(Air Pollution) ఢిల్లీ(Delhi)లో ఉంటుందని తెలుసు. దీపావళి పండుగ రాత్రి, ఆ మరుసటి రోజు ఈ పొల్యూషన్ పీక్‌కు చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ/AQI) ఏకంగా 999కు చేరింది. ఢిల్లీ, ఎన్సీఆర్‌లో చాలా చోట్లా ఇదే పరిస్థితి. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని లోకల్ సర్కిల్స్ తన సర్వేలో స్పష్టంగా వివరించంది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రాం, ఫరీదాబాద్, గజియాబాద్‌ల నుంచి 21 వేల మంది నివాసుల నుంచి సేకరించిన శాంపుళ్ల నుంచి రూపొందించిన ఈ సర్వే ఢిల్లీలో నెలకొన్న తీవ్ర పరిస్థితులను వెల్లడించింది.
69 శాతం కుటుంబాలకు ఎఫెక్ట్:
ఈ సర్వే ప్రకారం ఢిల్లీ, ఎన్సీఆర్‌లలో నివసిస్తున్న ప్రతి పది కుటుంబాలకుగాను.. ఏడు కుటుంబాల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సభ్యులు ఉన్నారు. 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నారు. 62 శాతం కుటుంబాల్లో కనీసం ఒకరికైనా కాలుష్యం వల్ల కళ్లు మండుతున్నాయి. 46 శాతం కుటుంబ సభ్యులకు జలుబు, ముక్కుల్లో సమస్యలు ఉన్నాయి. చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సమస్యలు ఉన్నట్టు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆస్తమ ఉన్నట్టు 31 శాతం మంది, తలనొప్పితో బాధపడుతున్నట్టు 31 శాతం మంది, యాంగ్జయిటీతో 23 శాతం మంది, నిద్రలేమి సమస్యతో 15 శాతం మంది బాధపడుతున్నట్టు ఈ సర్వేలో తేలింది. కాగా, 31 శాతం కుటుంబాలు మాత్రం కాలుష్యంతో పెద్దగా ఇబ్బందిపడటం లేదని పేర్కొనడం గమనార్హం.
వేరే రాష్ట్రాలకు ప్రయాణాలు:
కాలుష్యం అధికంగా ఉండే ఈ నిర్ణీత కాలం నుంచి తప్పించుకోవడానికి 23 శాతం కుటుంబాలు ఎయిర్ ప్యూరిఫయర్లు వాడుతున్నట్టు తెలిపారు. అదే శాతం కుటుంబాలు తాము ఈ కాలుష్యంలోనే ఎలాంటి సపోర్ట్ లేకుండా జీవిస్తున్నామని వివరించారు. 15 శాతం కుటుంబాలు మాస్క్ ధరించి ఇంటి, ఇతర పనులు చేసుకుంటున్నామని, అదే సంఖ్యలో కుటుంబాలు ఆరోగ్యం కోసం తాము రోగనిరోధక శక్తినిచ్చే ఆహారం, పానియాలను తీసుకుంటున్నామని చెప్పారు. సుమారు 15 శాతం కుటుంబాలు ఈ కాలంలో తాము ఢిల్లీ వదిలి వేరే రాష్ట్రాలకు ప్రయాణించాలని ప్లాన్ వేస్తున్నట్టు తెలిపారు. రెండు వారాల క్రితమే చేపట్టిన ఇలాంటి సర్వేలో 18 శాతం కుటుంబాలు ఎయిర్ ప్యూరిఫయర్లు వాడుతున్నట్టు చెప్పగా.. తాజా సర్వేలో ఈ సంఖ్య 23 శాతానికి పెరగడం గమనార్హం.