దేవుడి ప్రసాదం తిని 600 మందికి అస్వస్థత.. ఆసుపత్రిలో బెడ్స్ లేక రోడ్డుపైనే చికిత్స

by Prasad Jukanti |
దేవుడి ప్రసాదం తిని 600 మందికి అస్వస్థత.. ఆసుపత్రిలో బెడ్స్ లేక రోడ్డుపైనే చికిత్స
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవుడి ప్రసాదం తిని 600 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురైన షాకింగ్ ఘటన మహారాష్ట్ర బుల్దానా జిల్లా లోనార్ తాలూకా సోమ్‌థానా గ్రామంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఏకాదశి సందర్భంగా గ్రామంలో ధార్మిక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు. ఈ ప్రసాదం తిన్న తర్వాత భక్తులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వికారం, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. మరికొంత మంది మూర్చబోయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నట్లు సమాచారం. వెంటనే వీరిని లోనార్, మెహకర్, సింద్‌ఖేడ్ రాజాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆసుపత్రిలో బెడ్స్ సరిపోక రోడ్లపైనే తాడుకు సెలైబ్ బాటిల్స్ కట్టి చికిత్స అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. కాగా వీరిలో కొంత మంది భక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story