- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మగ్లింగ్ చేసిన 52 ఇండోనేషియా పక్షులను రక్షించిన అస్సాం అధికారులు
దిశ, నేషనల్ బ్యూరో: స్మగ్లింగ్ చేసిన 52 ఇండోనేషియా పక్షులు, జంతువులను శుక్రవారం అస్సాం అధికారులు రక్షించారు. రాష్ట్ర పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో బ్లాక్ లోరీ పక్షులు, రెడ్ అండ్ బ్లూ లోరీస్, బాబిరుసా స్వైన్, హార్న్‌బిల్స్ పక్షులు, జంతువులు ఉన్నాయి. హైలాకండిలోని అస్సాం-మిజోరాం సరిహద్దు సమీపంలో చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రక్షించిన యాభై రెండు పక్షుల్లో 42 రెడ్ అండ్ బ్లూ లోరీస్, ఆరు బ్లాక్ లోరీస్, రెండు హార్న్‌బిల్స్, ఒక బాబిరుసా(ఇండోనేషియా స్వైన్) ఉన్నాయి. బిలాయ్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారుల ప్రకారం, అరెస్ట్ వారిని మెయినుద్దీన్ అలీ, సంసుల్ హక్‌గా గుర్తించారు. ఇద్దరూ అస్సాంలోని హోజాయ్ ప్రాంతానికి చెందినవారు. గతేడాది సెప్టెంబర్‌లో సైతం అస్సాంలోని కాచర్ జిల్లాలో బ్లాక్ మకాక్, గొరిల్లాలు సహా ఎనిమిది అరుదైన జంతువులను రక్షించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.