- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పుర్రె తెరిచిన డాక్టర్లు.. నవ్వుతూ సర్జరీ చేయించుకున్న ఐదేళ్ల బాలిక
దిశ, నేషనల్ బ్యూరో : 5 సంవత్సరాల 10 నెలల బాలిక ధైర్యంలో పెద్దలను కూడా దాటేసింది. ఓ వైపు డాక్టర్లు ఆమెకు మత్తుమందు ఇచ్చి పుర్రెను తెరిచారు. మెదడులోకి వైద్య పరికరాలను చొప్పించి సర్జరీ చేయడం మొదలుపెట్టారు.. మరోవైపు ఆమె నవ్వుతూ డాక్టర్లతో మాట్లాడుతోంది. డాక్టర్లు ఏదైనా అడిగితే స్వీట్‌గా సమాధానాలు చెబుతోంది. ఈ అరుదైన సర్జరీ ఢిల్లీ ఎయిమ్స్‌లో సక్సెస్ ఫుల్‌గా జరిగింది. బాలిక చూపిన ధైర్యం వల్లే ఇది సాధ్యమైందని డాక్టర్లు తెలిపారు. మేల్కొని ఉండగానే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా ఈ బాలిక నిలిచిందని వెల్లడించారు. సర్జరీ చేస్తుండగా డాక్టర్లు.. ‘‘నీ నోటి నుంచి దంతాలు ఎక్కడికి పోయాయి’’ అని అడిగారు. ‘‘ఎలుకలు వాటిని తీసుకున్నాయి’’ అని బాలిక బదులిచ్చింది.
పుర్రెకు రెండు వైపులా 16 ఇంజెక్షన్లు
ఎయిమ్స్ న్యూరో అనస్తీషియా విభాగానికి చెందిన డాక్టర్ మిహిర్ పాండ్యా మాట్లాడుతూ.. బాలికకు ఈ ఆపరేషన్ చేసేముందు ఆమె పుర్రెకు రెండు వైపులా 16 ఇంజెక్షన్లు ఇచ్చామని తెలిపారు. ఇంజెక్షన్ నొప్పి తక్కువగా అనిపించేలా కొంత మత్తుమందును కూడా ఇచ్చామన్నారు. తాము అనుకున్న విధంగానే సర్జరీ టైంలో పుర్రె తెరిచి మెదడుకు ట్రీట్మెంట్ చేస్తుండగా.. బాలిక మేల్కొందని చెప్పారు. దీంతో మాట్లాడుతూ, ఫోటోలు, వీడియోలు చూపిస్తూ ఆమెకు టైం పాస్ చేశామని డాక్టర్ మిహిర్ పాండ్యా వివరించారు. ఈ రకమైన సర్జరీ చేసే టైంలో రోగిని మెలకువగా ఉంచడంలో ముఖ్య ఉద్దేశం.. సర్జరీ టైంలోనే రోగి జ్ఞాపకశక్తి, మాటతీరు, నాడీ మండలం పనితీరును పరిశీలించడమేనని ఆయన చెప్పారు.