Fake Job Offers : సైబర్ క్రైమ్ సెంటర్ల నుంచి 47 మంది భారతీయులకు విముక్తి

by Hajipasha |
Fake Job Offers : సైబర్ క్రైమ్ సెంటర్ల నుంచి 47 మంది భారతీయులకు విముక్తి
X

దిశ, నేషనల్ బ్యూరో : భారీ శాలరీ ప్యాకేజీల ఆశతో కొందరు భారతీయులు లావోస్ దేశానికి వెళ్లారు. అక్కడి బోకియో ప్రావిన్స్‌లో ఉన్న పలు కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరారు. చివరకు అవి మోసపూరిత కంపెనీలు అని తెలుసుకొని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. భారత్‌లోని తమ వారికి ఆ సమాచారాన్ని చేరవేశారు. దీంతో లావోస్ దేశంలోని భారత ఎంబసీ రంగంలోకి వారికి చేయూత అందించింది. శనివారం రోజు దాదాపు 47 మంది భారతీయులకు బోకియో ప్రావిన్స్‌లోని ఫేక్ కంపెనీల నుంచి విముక్తి కల్పించింది. ఆయా కంపెనీలు సైబర్ క్రైమ్ కార్యకలాపాలు నిర్వహించేవని భారత ఎంబసీ విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలియకపోవడం వల్లే భారతీయులు వాటిలో చేరారని తెలిపారు.

47 మంది భారతీయులు లావోస్ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. భారతీయులను దగా చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని లావోస్ ప్రభుత్వాన్ని భారత ఎంబసీ అధికార వర్గాలు కోరాయి. లావోస్‌కు చెందిన కంపెనీల్లో చేరే ముందు ఏవైనా సందేహాలు కలిగితే తప్పకుండా భారత ఎంబసీని సంప్రదించాలని భారతీయ ఉద్యోగార్థులకు సూచించాయి. ఇప్పటివరకు తాము మొత్తం 635 మంది భారతీయులను లావోస్‌లోని ఫేక్ కంపెనీల చెర నుంచి రక్షించి స్వదేశానికి పంపామని చెప్పాయి.

Advertisement

Next Story

Most Viewed