'తప్పిపోయిన లక్షలాది పిల్లల్ని కుటుంబాలతో కలిపాం'

by Vinod kumar |
తప్పిపోయిన లక్షలాది పిల్లల్ని కుటుంబాలతో కలిపాం
X

న్యూఢిల్లీ: 2015 నుంచి తప్పిపోయిన 4.46 లక్షల మంది పిల్లల్లో చాలా మందిని తిరిగి వారి కుటుంబాలతో కలిపామని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ శనివారం తెలిపారు. చట్టపరిధిలో లేని పిల్లలపై జాతీయ వార్షిక వాటాదారుల సంప్రదింపుల ప్రారంభ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. మంత్రిత్వ శాఖకు సంబంధించి 2015లో ప్రారంభించిన ఖోయా పాయా పోర్టల్ ద్వారా పిల్లలను కనుగొన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 4,46,000 మంది తప్పిపోయిన పిల్లలను కనుగొన్నట్లు చెప్పిన కేంద్ర మంత్రి.. వీరిలో 3,97,530 మంది విజయవంతంగా వారి తల్లిదండ్రులతో సరిపోలారని వెల్లడించారు.

అందరినీ వారి కుటుంబాలతో కలిపామని సగర్వంగా చెప్పగలమని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ పేర్కొన్నారు. 2021లో జువెనైల్ జస్టిస్ యాక్ట్‌ను సవరించిన తర్వాత దత్తత ఉత్తర్వులు జారీ చేసే బాధ్యత.. కోర్టులకు బదులుగా జిల్లా మేజిస్ట్రేట్‌లకు ఇవ్వబడింది. దీంతో అప్పటి నుంచి 2,600 మంది పిల్లలను పలువురు దత్తత తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఇక పిల్లలను సంస్థాగతీకరించే విషయంలో లాభాపేక్ష గురించి ఆలోచించకూడదని వాటాదారులను హెచ్చరించింది. ఒకవేళ లాభమే మా ప్రయత్నాలకు ప్రధాన అంశంగా మారితే.. చాలా మంది పిల్లలు తమకు ప్రేమను పంచే గృహాలను కనుగొనలేరని అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story