Heavy Rains: పూణెలో భారీ వర్షాలకు నలుగురు మృతి

by S Gopi |
Heavy Rains: పూణెలో భారీ వర్షాలకు నలుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని పూణె సహా వివిధ ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, నివాస సముదాయాలు నీట మునిగాయి. దీంతో ఆయా ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పూణె జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. పూణెతో పాటు రాష్ట్రంలోని కొంకణ్, పక్కనే ఉన్న ఘాట్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాల పడే అవకాశాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోనూ అతి భారీ వర్ష సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది. గంగా పశ్చిమ బెంగాల్, పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌పై తుఫాను ప్రభావితం కావడంతో పశ్చిమ తీరం వెంబడి బలమైన గాలులతో పాటు రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజా ప్రకటనలో అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు పూణెలో నలుగురు మృతి చెందారు. లావాసాలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకుపోయారని, మరో ఇద్దరు కత్రాజ్, ననయన్ పేత్‌లో మునిగి అదృశ్యమయ్యారని స్థానికులు పేర్కొన్నారు.

Advertisement

Next Story