- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన 32 మంది నేతలు
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 32 మంది నేతలు ఆదివారం అధికారిక పార్టీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ హాయంలో పనిచేసిన మాజీ మంత్రులు లాల్ చంద్ కటారియా, రాజేంద్ర యాదవ్‌తో సహా మాజీ ఎమ్మెల్యేలు విజయపాల్ మిర్ధా, రిచ్‌పాల్ మిర్ధా, ఖిలాడీ బైర్వా, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ చీఫ్ సేవాదళ్ సురేష్ చౌదరి, రాంపాల్ శర్మ, రిజు జున్‌జున్‌వాలా, స్వతంత్ర మాజీ ఎమ్మెల్యే అలోక్ బెనివాల్ ఇంకా పలువురు నేతలు బీజేపీలో చేరారు. జైపూర్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీపీ జోషి, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌లు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కటారియా, యాదవ్‌లు మంత్రులుగా పనిచేశారు. కటారియా గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఉన్నారు.