ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ కీలక నేతలు మృతి.. మొత్తం 29కి చేరిన సంఖ్య

by GSrikanth |
ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ కీలక నేతలు మృతి.. మొత్తం 29కి చేరిన సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బ‌స్తార్‌లోని కాంకేర్‌లో భ‌ద్రత బ‌ల‌గాల‌కు, మావోయిస్టుల‌కు మధ్య భారీ ఎన్‌కౌంట‌ర్ జరిగింది. కాంకేర్ జిల్లా చోటేబైధియా పోలీస్ స్టేష‌న్‌ ప‌రిధిలోని క‌ల్పర్ అడ‌విలో భ‌ద్రత బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వహిస్తున్న స‌మ‌యంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివ‌ర‌కు 29 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. మృతుల్లో మావోయిస్టు ద‌ళ క‌మాండ‌ర్ శంక‌ర్ రావు ఉన్నట్లు ఎస్పీ కల్యాణ్ ఎలిసేలా ధృవీక‌రించారు. ద‌ళ కమాండ‌ర్ శంక‌ర్ రావుపై రూ.25 ల‌క్షల రివార్డు ఉంది. ఈ ఎన్ కౌంట‌ర్‌లో ఒక‌ ఇన్స్పెక్టర్‌, ఇద్దరు బీఎస్ఎఫ్ జ‌వాన్లు గాయ‌ప‌డ్డారు. ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన ఘ‌ట‌నా స్థలం నుండి 4 ఏకే 47, రైఫిల్స్, భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్‌కౌంట‌ర్‌కు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది. చనిపోయిన మావోయిస్టుల్లో తెలంగాణకు చెందిన కీలక నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed