Deepotsav: అయోధ్యలో దీపాలతో గిన్నిస్ రికార్డ్

by Mahesh Kanagandla |
Deepotsav: అయోధ్యలో దీపాలతో గిన్నిస్ రికార్డ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya) నగరంలో దీపావళి పండుగ(Diwali Festival) సంబురాలు మొదలయ్యాయి. ఎనిమిదేళ్ల క్రితం మొదలు పెట్టిన దీపోత్సవం(Deepotsav) ఇక్కడ ఘనంగా జరిగింది. సరయూ నది(Sarayu River) తీరంలో నిర్వహించిన దీపోత్సవం కార్యక్రమంలో 25 లక్షల దీపాలను వెలిగించారు. ఇది గిన్నిస్ రికార్డు. అయోధ్య నగరంలో రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత నిర్వహిస్తున్న తొలి దీపావళి పండుగ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీపాలతోపాటు లేజర్ షో నిర్వహించారు. రామాయణ నాటకాన్నీ ప్రదర్శించారు. డ్రోన్స్‌తో రామాయణంలోని ముఖ్య ఘట్టాలను షో చేశారు. ఇక ఈ కార్యకమ్రంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనల్లో ఆరు దేశాలు మయన్మార్, నేపాల్, థాయ్‌లాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు.

ఈ భారీ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలు కాపాడటానికి 10,000 భద్రతా సిబ్బందిని నగరంలో మోహరించింది. ఇందులో సగం మంది సివిల్ డ్రెస్‌లో ఉండటం గమనార్హం. ఘాట్ 10 వద్ద 80 వేల దీపాలు స్వస్తిక గుర్తులో అమర్చారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్ కి పైడికి వెళ్లే 17 మార్గాలను మూసేయగా.. కేవలం పాస్‌ ఉన్నవారికి మాత్రమే అనుమతించారు. రామాయణ పాత్రలతో అయోధ్యలో శకటాలను ప్రదర్శించారు. యోగి ఆదిత్యానాథ్ ఈ ప్రదర్శనకు ఆరతి ఇచ్చారు. రాముడు, సీత, లక్ష్మణ, హనుమాన్ పాత్రలు కూర్చున్న రథాన్ని సీఎం యోగి ఆదిత్యానాథ్ స్వయంగా లాగారు.

Advertisement

Next Story