రెండు వారాల్లో 22 మంది మృతి, రూ.172కోట్ల నష్టం.. హిమాచల్‌లో వర్షాల ఎఫెక్ట్

by vinod kumar |
రెండు వారాల్లో 22 మంది మృతి, రూ.172కోట్ల నష్టం.. హిమాచల్‌లో వర్షాల ఎఫెక్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీని వల్ల రెండు వారాల్లోనే 22 మంది ప్రాణాలు కోల్పోగా, రూ.172 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు బుధవారం తెలిపారు. పలు ఘటనల్లో వీరంతా ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. గత 24 గంటల్లో బైజ్‌నాథ్‌లో 32 మిల్లీమీటర్ల వర్షపాతం, పోంటా సాహిబ్‌లో 18.4, ధౌలకువాన్‌లో 17.5, ధర్మశాలలో 11, డల్హౌసీలో 10, పాలంపూర్‌లో 8.3 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైనట్టు పేర్కొన్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిస్తాచనే అంచనాల నేపథ్యంలో సిమ్లాలోని వాతావరణ కార్యాలయం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరదలు వస్తుండటంతో మండిలో ఐదు, సిమ్లాలో నాలుగు, కాంగ్రాలో మూడు రోడ్లు మూసి వేశారు.

తగ్గిన పర్యాటకుల సంఖ్య!

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం, కొండచరియలు విరిగిపడతుండటంతో ప్రజలు రాష్ట్రాన్ని సందర్శించడానికి భయపడుతున్నారు. దీంతో పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. పర్యాటకులు తక్కువ సంఖ్యలో సిమ్లా, మనాలికి చేరుకుంటున్నారని, హోటళ్లలో 20 శాతం వరకు మాత్రమే ఆక్యుపెన్సీ ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు, సిమ్లాలో భారీ వర్షాల కారణంగా, రిడ్జ్ గ్రౌండ్ సమీపంలోని పద్మా ప్యాలెస్ క్రింద పగుళ్లు ఏర్పడి, ఇక్కడ భూమి కుంగిపోయే ప్రమాదం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

Advertisement

Next Story