భారత్‌లో 22 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్

by S Gopi |   ( Updated:2024-03-26 18:32:26.0  )
భారత్‌లో 22 లక్షల వీడియోలు తొలగించిన యూట్యూబ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా గతేడాది అక్టోబర్-డిసెంబర్ మధ్య భారత్‌లో 22.5 లక్షలకు పైగా వీడియోలను తొలగించినట్టు యూట్యూబ్ వెల్లడించింది. వీడియో తొలగింపుల జాబితాలో యూఎస్, రష్యా వంటి దేశాలను దాటి భారత్ అగ్రస్థానంలో ఉంది. భారత్ తర్వాత సింగపూర్(12.43 లక్షల వీడియోలు) తొలగింపుతో రెండో స్థానంలో ఉండగా, అమెరికా(7.88 లక్షలు), ఇండోనేషియా(7.70 లక్షలు), రష్యా(5.16 లక్షలు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2023 అక్టోబర్-డిసెంబర్ మధ్య 30 దేశాల వీడియోల తొలగింపు జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉంది. మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు సమీక్షించిన కాలంలో యూట్యూబ్ 90 లక్షలకు పైగా వీడియోలను తొలగించింది. 96 శాతం వీడియోలను మెషిన్స్‌తో గుర్తించినట్టు తెలుస్తోంది. హాని కలిగించే, ప్రమాదకరమైన కంటెంట్, పిల్లల భద్రత, హింసాత్మక, గ్రాఫిక్, న్యూడిటీ, లైంగిక, తప్పుడు సమాచారంతో కూడిన కంటెంట్ సహా ఇతర ప్రమాణాలాను పరిగణలోకి తీసుకుని ఆయా వీడియోలను తీసేశామని యూట్యూబ్ పేర్కొంది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శకాల ఉల్లంఘన కింద 2.05 కోట్ల ఛానెళ్లను యూట్యూబ్ తొలగించింది.

Advertisement

Next Story