‘కోటా’లో మరో విద్యార్థి ఆత్మహత్య..

by Vinod kumar |
‘కోటా’లో మరో విద్యార్థి ఆత్మహత్య..
X

జైపూర్‌: ఇంజనీరింగ్, మెడికల్ కోచింగ్ హబ్‌గా పేరొందిన రాజస్థాన్‌‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థి తన్వీర్‌ సూసైడ్ చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య 27కు పెరిగింది. తన్వీర్‌ గత ఏడాది కాలంగా తన తండ్రి మహ్మద్‌ హుస్సేన్‌, సోదరితో కలిసి కోటాలోని కున్హాడి ప్రాంతంలోనే ఉంటూ.. కోచింగ్ తీసుకోకుండా స్వయంగానే నీట్‌‌కు ప్రిపేర్‌ అవుతున్నాడు.

ఈ క్రమంలో బుధవారం రాత్రి తన్వీర్‌ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతసేపటికీ అతడు బయటకు రాకపోవడంతో సోదరి వెళ్లి తలుపుతట్టింది. అయినా లోపలి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో అనుమానం వచ్చి తలుపు బద్దలుకొట్టి చూడగా.. తన్వీర్‌ ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed