క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్.. జూలై 1 నుంచి 20% పన్ను

by Mahesh |
క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్.. జూలై 1 నుంచి 20% పన్ను
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విక్రేతలకు చేసే అన్ని చెల్లింపులు లేదా అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా విదేశీ మారకపు చెల్లింపులు జూలై 1 నుంచి మూలాధారం (TCS) వద్ద 20% పన్ను వసూలు చేయనున్నారు. కాగా ఇప్పటి వరకు సరళీకృత చెల్లింపుల పథకం కింది భారత వెలుపల చేసే చెల్లింపులపై కేవలం 5 శాతం మాత్రమే పన్ను విధించేవారు. కాగా ప్రస్తుతం ఈ పన్ను చెల్లింపు విదానంలో మార్పులు చేసిన ప్రభుత్వం దేశం వెలుపల చేసే ఈ చెల్లింపుపై 20 శాతం పన్ను విదించాలని నిర్ణయింది. దీంతో అంతర్జాతీయంగా క్రెడిట్ కార్డులను ఉపయోగించే వినియోగదారులకు పన్ను భారం పడనుంది.

Advertisement

Next Story

Most Viewed