- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 శాతం టైప్ 2 డయాబెటిస్ కేసులకు వాయు కాలుష్యమే కారణం
దిశ, నేషనల్ బ్యూరో: గాలిలో విషవాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని ఓ కొత్త అధ్యయనం తెలిపింది. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ నివేదిక ప్రకారం, 20 శాతం టైప్2 మధుమేహం ఈ గాలిలో పీఎం 2.5 కాలుష్య కారకాలు కారణమవుతున్నాయి. ఈ కాలుష్యం చమురు, డీజిల్, బయోమాస్, గ్యాసోలిన్ దహనం నుంచి విడుదలవుతాయి. పీఎం 2.5 కాలుష్య కారకం పట్టణ ప్రంతాల్లో వాయు కాలుష్యానికి ప్రధాన కారణమవుతోంది. దీనివల్ల నాడీ వ్యవస్థ ద్వారా ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని పెంచుతుంది. దానివల్ల హృదయ సంబంధ వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధ్యయనం పేర్కొంది. నెలపాటు ఈ పీఎం 2.5 కాలుష్య కారకానికి గురైతే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేందుకు దారితీస్తుందని, సుధీర్ఘంగా(దాదాపు ఒక ఏడాది) కాలుష్య కారకానికి గురైతే 20 శాతం టైప్2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. దాదాపు 53.7 కోట్ల మంది టైప్2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. వారిలో సగం మందికి తాము డయాబెటిక్ అని కూడా తెలియదని అధ్యయనం వెల్లడించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, భారత్‌లో 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న 7.7 కోట్ల మంది మధుమేహం(టైప్2), దాదాపు 2.5 కోట్ల మంది ప్రీడయాబెటిక్(భవిష్యత్తులో మధుమేహం బారిన పడే ప్రమాదం)తో బాధపడుతున్నారు.