భోజ్‌శాల కాంప్లెక్స్‌ సర్వేలో 39 విరిగిన విగ్రహాలతో సహా 1,710 అవశేషాలు

by S Gopi |
భోజ్‌శాల కాంప్లెక్స్‌ సర్వేలో 39 విరిగిన విగ్రహాలతో సహా 1,710 అవశేషాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని మధ్యయుగం నాటి కట్టడం భోజ్‌శాల కాంప్లెక్స్‌లో 98 రోజుల పాటు పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహించిన సర్వేలో వాగ్దేవి (సరస్వతి), మహిషాసుర మర్దిని, గణేష్, కృష్ణుడు, మహాదేవ్, బ్రహ్మ, హనుమంతుని విగ్రహాలు కనుగొన్నారు. ఈ సర్వేలో మొత్తం 1,710 అవశేషాలలో ఉన్నాయి. అందులో 39 విరిగిన విగ్రహాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మార్చి 11న మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ధార్ జిల్లాలో మధ్యయుగ నాటి భోజ్‌శాల నిర్మాణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని ఏఎస్ఐని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1న మౌలానా కమాలుద్దీన్‌ వెల్ఫేర్‌ సొసైటీ సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్‌ వేసింది. అయితే సర్వేపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఏఎస్ఐ అధ్యయన ఫలితాలపై సొసైటీ అనుమతి లేకుండా ఎటువంటి చర్య తీసుకోరాదని పేర్కొంది. ఏఎస్ఐ సర్వే ఈ వారంలో ముగియనుండగా జూలై 4న నివేదికను సమర్పించనున్నట్టు భావిస్తున్నారు. అయితే, నిర్మాణం, చుట్టుపక్కల ప్రాంతాలను మరింత లోతుగా తవ్వేందుకు పురావస్తు శాఖ మరింత గడువును కోరవచ్చని సమాచారం. సర్వే చివరిరోజున ఏఎసి భోజ్‌శాల ఉత్తరవైపున ఏడు నిర్మాణాలను కనుగొన్నారు. వాటిలో ఒకటి విరిగినదేవతా విగ్రహం, మిగిలినవి విరిగిన స్తంభం ముక్కలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed