- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్లి ఆటోలో వస్తుండగా శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఆ ఆటో, స్లీపర్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మరణించారని, అందులో 8 మంది బాల బాలికలే ఉన్నట్టు అధికారులు ఆదివారం ధ్రువీకరించారు.
బారి నగరంలోని గుమత్ మొహల్లాకు చెందిన వారు ఫంక్షన్ కోసం బరౌలీ గ్రామానికి వెళ్లారు. ఫంక్షన్ తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. ఆటో బారి సిటీ వైపు వస్తుండగా.. స్లీపర్ బస్సు ధోల్‌పూర్ నుంచి జైపూర్‌కు వెళ్లుతున్నది. బారి సదర్ పోలీసు స్టేషన్ ఏరియాలో రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ రెండు ఢీకొట్టుకున్నాయి. ఐదుగురు బాలురు, ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు(ఆటో డ్రైవర్) మరణించారు. గాయపడినవారికి ట్రీట్‌మెంట్ కోసం బారి హాస్పిటల్ తరలించారు. ఆటో, బస్సును సీజ్ చేసినట్టు బారి కొత్వాలీ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ శివ్ లహరి మీనా తెలిపారు.
ఈ విషాద ఘటనపై సీఎం భజన్ లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్టు వివరించారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కూడా మృతులకు సంతాపం తెలిపారు.