- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అయోధ్య రామయ్య సన్నిధికి 1.11 కేజీల లడ్డూలు.. ఎందుకో తెలుసా ?
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీరామ నవమి వేడుకలకు అయోధ్య రామమందిరం సిద్ధమవుతోంది. అయోధ్య వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే పలుప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరామనవమి రోజున లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా ఏకంగా లక్ష కిలోల లడ్డూని ప్రసాదంగా సమర్పించబోతున్నారు. దేవరహ హన్స్ బాబా ట్రస్ట్ తరఫున 1,11,111 కిలోల లడ్డూ ప్రసాదాన్ని ఆలయానికి పంపనున్నట్లు తెలిపారు ఆ ట్రస్టు సభ్యులు అతుల్ కుమార్ సక్సేనా
లడ్డు ప్రసాదాలను ప్రతీ వారం కాశీ విశ్వనాథ ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయాలకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 22న అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా రోజున దేవ్రహ హన్స్ బాబా ఆశ్రమం 40 వేల కిలోల లడ్డూను నైవేద్యానికి పంపినట్లు తెలిపారు.
అయోధ్యలో శ్రీరాముడి ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి. రామ్ లల్లా విగ్రహానికి ప్రత్యేక వస్త్రాలతో పాటు వేల క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని అలంకరించనున్నారు. అయోధ్య సిటీ వ్యాప్తంగా వందకు పైగా ఎల్ ఈడీ స్క్రీన్లను సిద్ధం చేస్తున్నారు. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు 600 మీటర్ల మేర జర్మన్ హ్యాంగర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు, రామనవమి సందర్భంగా ఈనెల 15 నుంచి 18 వరకు రామ్‌లల్లా దర్బారులో వీఐపీ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీ దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవని మార్గదర్శకాలను జారీ చేస్తూ ట్రస్టు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి 18 మధ్య వీఐపీ పాస్‌లు జారీ అయిన వారి పాస్‌లు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.