Ayodhya Temple: చరిత్ర సృష్టించిన అయోధ్య.. ఆరు నెలల్లో 11 కోట్ల మంది దర్శనం

by Mahesh |
Ayodhya Temple: చరిత్ర సృష్టించిన అయోధ్య.. ఆరు నెలల్లో 11 కోట్ల మంది దర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అవాంతరాలు, ఎంతోమంది ప్రాణత్యాగం, హిందూ సంఘాల అలుపులేని పోరాటం, సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్య(Ayodhya)లో రామ మందిర నిర్మాణం ప్రారంభం అయింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలోని అయోధ్యలో ఈ రామమందిర నిర్మాణం పూర్తికావడంతో 2024 జనవరి 22 అంగరంగ వైభవంగా అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా (Ram Lalla) ప్రాణప్రతిష్ట ప్రారంభోత్సం ప్రధాని మోడీ చేతుల మీదుగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరు వేల మంది ప్రముఖుల రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు అయిన విషయం తెలిసిందే. ప్రాణ ప్రతిష్ట జరిగిన రెండు వారాల తర్వాత రామ భక్తులకు అయోధ్య ప్రధాన ఆలయంలోకి అనుమతించారు. దీంతో నాటి నుంచి నేటి వరకు మొదటి ఆరు నెలల్లో.. 11 కోట్ల మంది యాత్రికులు, పర్యాటకులు అయోధ్యను సందర్శించారు. దీనిని ఈ రోజు ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారికంగా విడుదల చేసింది. అలాగే అయోధ్యతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలను మొత్తం 33 కోట్ల మంది పర్యాటకులు సందర్శించగా.. అయోధ్యను సందర్శించిన భక్తుల సంఖ్య ఇందులో ( 33 కోట్లలో) మూడో వంతుగా నిలిచిందని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed