సరిహద్దు భద్రతా దళంలో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్: కేంద్రం ప్రకటన

by Harish |
సరిహద్దు భద్రతా దళంలో అగ్ని వీరులకు 10 శాతం రిజర్వేషన్: కేంద్రం ప్రకటన
X

న్యూఢిల్లీ: అగ్నిపథ్ కి అనుగుణంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రతిష్టాత్మకమైన అగ్నిపథ్ పథకానికి అనుగుణంగా, సరిహద్దు భద్రతా దళంలో ఖాళీల్లో మాజీ అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించింది. ఈ ప్రకటన మార్చి 9 నుండి అమల్లోకి వస్తుంది."ఖాళీలలో పది శాతం మాజీ అగ్ని వీరుల కోసం రిజర్వ్ చేయబడుతుంది" అని నోటిఫికేషన్ పేర్కొంది. మాజీ అగ్ని వీరుల మొదటి బ్యాచ్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని, ఇతర బ్యాచ్‌ల అభ్యర్థులకు మూడేళ్ల వరకు పరిమితి సడలింపు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

మాజీ అగ్నివీరులకు కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు ఉంటుందని నోటిఫికేషన్ పేర్కొంది. ఆర్మీ, నేవీ, వైమానిక దళంలో 17న్నర నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువకుల నియామకం కోసం కేంద్రం గత ఏడాది జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ పథకం కింద రిక్రూట్ అయిన వారిని 'అగ్నివీర్లు' అంటారు.

నాలుగు సంవత్సరాల పదవి కాలం పూర్తయిన తర్వాత, ప్రతి బ్యాచ్ నుండి రిక్రూట్ అయిన వారిలో 25 శాతం మందికి రెగ్యులర్ సర్వీస్ అందించబడుతుంది. అంతకు ముందు కేంద్ర పారామిలటరీ బలగాలు, అస్సాం రైఫిల్స్‌లో 10 శాతం ఖాళీలను 75 శాతం అగ్నివీరుల కోసం రిజర్వ్ చేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed