రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు భారీ ఆఫర్

by M.Rajitha |
రాహుల్ గాంధీ కుట్టిన చెప్పులకు భారీ ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల యూపీలోని సుల్తానపూర్ లో రాహుల్ గాంధీ చెప్పులు కుట్టగా, వాటిని కొనుక్కోడానికి చాలామంది భారీగా ఆఫర్ చేస్తున్నారు. పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్ అక్కడే ఉన్న రామ్ చైత్ అనే చెప్పులు కుట్టుకునే దుకానదారుడితో కాసేపు మాట్లాడి అక్కడే ఉన్న పాత చెప్పులను కుట్టారు. అప్పటినుండి తన షాప్ కి చాలామంది వచ్చి తనతో ఫోటోలు దిగుతున్నారని, విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయని రామ్ తెలిపాడు. రాహుల్ కుట్టిన చెప్పులకు ఓ వ్యక్తి 10 లక్షలు ఆఫర్ చేశాడని, కానీ తాను ఆ చెప్పులను ఎవరికీ అమ్మబోనని, ఫ్రేమ్ కట్టి వాటిని భద్రంగా దాచుకుంటానని మీడియాకు వెల్లడించాడు. తనకి సహాయం చేస్తానని మాటిచ్చిన రాహుల్ గాంధీ... మరుసటి రోజే తనకు కుట్టుయంత్రాన్ని బహుమతిగా పంపించాడని ఆనందం వ్యక్తం చేశాడు.

Next Story

Most Viewed