పాలమూరులో డబుల్‌ బెడ్‌ రూమ్ ఇండ్లు.. జాతీయ స్థాయిలో గుర్తింపు

by Shyam |
పాలమూరులో డబుల్‌ బెడ్‌ రూమ్ ఇండ్లు.. జాతీయ స్థాయిలో గుర్తింపు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేటలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నమూనాకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి. పట్టణ ప్రాంతంలో పీఎంఏవై ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన నమూనా ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రదర్శనకు తెలంగాణ నుంచి వీరన్నపేటలో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్ రూమ్‌ల ఇండ్ల నమూనా రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడంతో జాతీయ ప్రదర్శనకు కూడా పంపారు.

వీరన్నపేట‌లో నిర్మాణమవుతున్న డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణ నమూనా.. సందర్శకులను అమితంగా ఆకట్టుకుందని, నివాసానికి మరింత సౌకర్యంగా ఉంటాయని పీఎంఏవై పథక రీజినల్ కోఆర్డినేటర్, సెంట్రల్ టీం ఇన్‌చార్జీ రవి పేర్కొన్నారు. ఇండ్ల నమూనాను రూపొందించడంలో ప్రధాన భూమిక పోషించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఫైనాన్స్ జీఎం ఎస్సీ వెంకటేశ్వర్లు, జనరల్ మేనేజర్ చైతన్య, గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్, మెప్మా పీడీ మల్లారెడ్డిలతోపాటు ప్రదర్శనలో పాల్గొనడానికి వెళ్లిన ఏఈ కుమార్, విజయ్ తదితరులకు ఎగ్జిబిషన్ నిర్వాహకులు అభినందనలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed