అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ

by sudharani |
అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ
X

కరోనా వైరస్ అమెరికాను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇందు కోసం 50 బిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల గవర్నమెంట్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లను త్వరితగతిన ఏర్పాటు చేసుకుని… ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయాలని సూచించారు. కరోనా టెస్టులు నిర్వహించి, గంటలోపే ఫలితాలు వెల్లడించేందుకు రెండు ల్యాబ్‌లను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. డియాసోరిన్‌ మాలిక్యులర్‌ ఆఫ్‌ కాలిఫోర్నియా, క్యూఐఏజెన్‌ ఆఫ్‌ మేరీల్యాండ్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసం దాదాపు 1.3 మిలియన్ల డాలర్లు ఖర్చుచేయనున్నట్లు సమాచారం.

tag; us, president, trump, national emergency

Advertisement

Next Story