- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ సార్.. బీసీ బంధు లేదా?
దిశ, మహబూబాబాద్: కేసీఆర్ సార్… మేం ఏం పాపం చేసినం సార్… బీసీలకు ఏం లేదా..? బీసీ బంధు అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పూలే జంక్షన్‌లో జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శంతన్ రామరాజు మాట్లాడుతూ.. ఏడు దశాబ్దాల స్వాతంత్ర్య భారతంలో బీసీలకు అన్ని రంగాల్లోనూ తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా పాలకులు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తూ అనుక్షణం బీసీ కులాల మధ్య చిచ్చు పెడుతూ ,వారిని సంఘటితం కాకుండా వారి ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు.
విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ రాక, కొలువులు లేక, ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే డబ్భులు లేక బీసీ యువత తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీసీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 54% బీసీలకు అర్హులైన వారందరికీ బీసీ బంధు వర్తింపజేసి కనీసం ఇరవై లక్షల చొప్పున ఋణాన్ని అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో బీసీల ఊసే లేదన్నారు. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల మోచేతికి బెల్లం పెట్టి నాకించే పనిలో ఉన్నారన్నారు. బీసీల అభ్యున్నతి కోసం బీసీ ప్రజాప్రతినిధులు, మేధావులు, బీసీ సంఘ నేతలు, యువత గొంతెత్తి బీసీలకు బీసీబంధు అని నినదించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. యావత్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి బీసీ తనకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియాజేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు నలమాస విక్రం గౌడ్, మాజీ సర్పంచ్ దుండి శ్రీనివాస్ గండ్రాతి మల్లేష్, ప్రేమ్ సాగర్ రామరాజు, తోట సురేష్ పటేల్, పింగళి సోమేశ్వర్, కృష్ణ, అందె భాస్కర్, పూజరి శ్రీనివాస్, చిట్టిమల్ల శ్రీమన్, జనగం సాయి పాల్గొన్నారు.