- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత ముస్లింలపై నషీరుద్దీన్ షా ఆగ్రహం.. అసలేం జరిగింది ?
ముంబై: తాలిబన్లను సమర్థిస్తున్న కొందరు భారత ముస్లింలపై బాలివుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు నషీరుద్దీన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అఫ్ఘాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడంతో భారత్‌లోని కొందరు ముస్లింలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకర ధోరణి’ అని తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘అఫ్ఘాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారం చేజిక్కించుకోవడంపై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతున్నది. అయినప్పటికీ భారత్‌లోని కొందరు ముస్లింలు అనాగరికంగా సంబురాలు చేసుకుంటున్నారు. ఇది తక్కువ ప్రమాదమేం కాదు’ అని అన్నారు.
‘తాలిబన్ల పునరుజ్జీవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నవారు తమ మతాన్ని సంస్కరించుకోవాలనుకుంటున్నారా? లేక అనాగరిక ఆచారాలతో అలాగే జీవించాలనుకుంటున్నారా? అనేదానిపై తమను తాము ప్రశ్నించుకోవాలి’ అని సూచించారు. ఈ సందర్భంగా భారతీయ ముస్లింలు పాటించే ఇస్లాంకు, ఇతర దేశాలవారు పాటించే ఇస్లాంకు మధ్య వ్యత్యాసాన్ని తెలిపారు. ప్రపంచంలోకెళ్లా ‘హిందుస్థానీ ఇస్లాం’ ప్రత్యేకమైనదని చెప్పారు. మనం గుర్తించలేనంతగా మార్పులు జరిగే సమయం రాకుండా ఆ దేవుడు చూస్తాడని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.