విద్యార్థుల సాయం కోరిన నాసా

by Harish |   ( Updated:2020-03-02 01:23:57.0  )
విద్యార్థుల సాయం కోరిన నాసా
X

దిశ, వెబ్‌డెస్క్:
చంద్రుడు, అంగారకుని మీద చేపట్టబోయే పరిశోధనల కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ఉండటానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యూనివర్సిటీల్లో చదివే విద్యార్థుల సాయం కోరడానికి కూడా సిద్ధపడింది. మూన్ టు మార్స్ ఎక్స్‌ప్లోరేషన్ సిస్టమ్స్ అండ్ హాబిటేషన్ అకాడమిక్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ (ఎం2ఎం ఎక్స్ హ్యాబ్) పేరిట తమ పరిశోధనల్లో ఔత్సాహిక విద్యార్థులకు నాసా భాగం కల్పిస్తోంది.

హ్యాబిటేషన్, వెహికిల్స్, రోబోటిక్ అడ్వాన్స్ మిషన్స్, ఫౌండేషనల్ రిమోట్ మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఆర్కిటెక్చర్ వంటి వివిధ విభాగాల్లో పరిశోధనలు చేసి కొత్త విషయాలను కనిపెట్టినవారికి, ఉన్న సమస్యలు తీర్చినవారికి అవార్డులు అందజేయనుంది. పరిశోధన, ఉత్పత్తిని బట్టి 15వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల వరకు బహుమతి అందజేయనున్నట్లు నాసా ప్రకటించింది. ఏప్రిల్ 24 లోగా యూనివర్సిటీల విద్యార్థులు తమ ప్రతిపాదనలు పంపించాల్సి ఉంటుంది.

ఇలాంటి ఛాలెంజ్‌లు నాసా వారి మూన్ అండ్ మార్స్‌ పరిశోధనల్లో చాలా కొత్త ఇన్నోవేషన్లు జరిగేలా చేస్తాయి. గతంలో ఇలాంటి ఛాలెంజ్‌ల కారణంగానే ఇన్‌ఫ్లేటబుల్ ఎయిర్‌లాక్ మాడ్యూల్స్ అభివృద్ధి చేయడానికి అవకాశం కలిగింది. ఈ సరికొత్త ప్రయోగంలో భూమి మీద కాకుండా ఇతర గ్రహాల మీద జీవించగలిగే పరిస్థితులను సృష్టించడమే నాసా లక్ష్యం.

Tags- nasa, moon, mars,

Advertisement

Next Story

Most Viewed