- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అంగారకుని మీద రంధ్రం.. ఫొటో విడుదల
దిశ, వెబ్‌డెస్క్:
అంగారక గ్రహానికి సంబంధించి ఏ చిన్న వివరమైనా అటు శాస్త్రవేత్తలకు, ఇటు ఔత్సాహిక విద్యార్థులకు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. ఆ గ్రహం మీద కూడా శోధించే కొద్దీ రోజుకో కొత్త విషయం బయటపడుతుంటుంది. ఈ క్రమంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వారు విడుదల చేసిన ఫొటో ఒకటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
అంగారకుని మీద 2011లో కనిపెట్టిన పావోనిస్ మోన్స్ అగ్నిపర్వతం ఫొటో అది. ప్రస్తుతం ఆ గ్రహాన్ని చుట్టేస్తున్న మార్స్ రికన్నాయ్‌సాన్స్ ఆర్బిటర్‌లోని హైరైస్ పరికరం ఈ ఫొటోను తీసింది. అయితే ఇందులో ఆసక్తికర విషయమేంటంటే.. ఈ అగ్నిపర్వతం లోపల కనిపిస్తున్న రంధ్రంలో జీవజాలం ఉండొచ్చని నాసా భావిస్తోంది. అంగారకుని మీది విపరీత వాతావరణ పరిస్థితులు ఈ రంధ్రం లోపలి భాగాలు ప్రభావితం చేయలేకపోవడం వల్ల జీవం బతికే అవకాశాలు ఉండొచ్చని అనుకుంటోంది. భవిష్యత్తులో రూపొందించబోయే స్పేస్ క్రాఫ్టులు, రోబోలు, చివరికి వ్యోమగాముల పరిశోధనలు కూడా ఇలాంటి రంధ్రాలను పరిశోధించడానికే చేయనున్నట్లు నాసా తన బ్లాగులో పేర్కొంది. ఫొటోను లోతుగా పరిశీలించి చూసినపుడు ఈ రంధ్రం 35 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల వరకు లోతు ఉండొచ్చని తెలిపింది.