- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాబిల్లి పై ఇళ్ల నిర్మాణం.. కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారో తెలుసా..?
అందమైన జాబిల్లి అంటే ఇష్టపడని వారే ఉండరు. ఎలాగైనా నిండు చంద్రుడిని చేరుకోవాలని అందరూ కోరుకుంటారు. అందుకే అక్కడ స్థిర నివాసం కోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కొన్ని విజయవంతం అయ్యాయి కూడా. తాజాగా అమెరికా మరో ముందడుగు వేసింది. చంద్రుడి కక్షలో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్ రెడీ చేసింది. దీని కోసం ఏకంగా ఓ సంస్థకు కాంట్రాక్ట్ కూడా ఇచ్చేసింది. వ్యోమగాములు అక్కడ అవాసం ఏర్పాటు చేసుకోవడం ఏకంగా 7 వేల కోట్ల రూపాయాలను ఖర్చు చేయనుంది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2024లో చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు సిద్ధమైంది. ‘ఆర్టిమిస్’పేరుతో కొత్త విషయాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. ఆర్టిమిస్ మిషన్ కోసం ఇప్పటికే 8 దేశాలు నాసాతో జతకట్టాయి. ఈ ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై పకడ్బందీ ప్రమాణాలతో శాశ్వత నిర్మాణాలను చేపట్టాలని నాసా నిర్ణయించింది. వ్యోమగాములు అక్కడే ఉండి ప్రయోగాలు చేసేలా చర్యలు చేపట్టింది. అందుకే జాబిలి కక్ష్యలోనే ఆస్ట్రోనాట్ల కోసం గేట్ వేను నిర్మించేందుకు సిద్ధం అయ్యారు శాస్త్రవేత్తలు. 93.5 కోట్ల డాలర్లు ఖర్చు చేసి నిర్మాణాలు చేపట్టనున్నారు.
హ్యాబిటేషన్ అండ్ లాజిస్టిక్స్ ఔట్ పోస్ట్ పేరుతో ఈ గేట్ వే ను నిర్మించనున్నారు. వీటిని అమెరికా ఆయుధ తయారీ సంస్థ నార్త్ రాప్ గ్రమ్మన్ కార్ప్ అనే సంస్థకు నాసా అప్పగించింది. దీంట్లో ఆస్ట్రోనాట్ల కోసం నివాస సముదాయాలు, టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా సౌర శక్తితో నడిచే క్రూ క్యాప్సూల్ ను డెవలప్ చేయనున్నారు. ఇది కనుక సక్సెస్ అయితే చంద్రుడి కేంద్రంగా ఇతర గ్రహాలను కూడా సులువుగా చేరుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద నాసా చేపట్టిన ఈ ప్రయోగం ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.
- Tags
- NASA