- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాసా ఆధ్వర్యంలో చంద్రుడిపైకి తొలి మహిళ.. ఎప్పుడంటే?
దిశ, ఫీచర్స్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’.. ఆర్టెమిస్(Artemis) స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంలో భాగంగా 2024 కల్లా చంద్రుడిపైకి మహిళతో పాటు శ్వేత జాతేతర వ్యక్తిని పంపించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చంద్రుడి దక్షిణ ధృవంపై ఆస్ట్రోనాట్లను దింపాలని భావిస్తున్న నాసా.. ఈ మిషన్‌కు గ్రీకు దేవత ‘ఆర్టెమిస్’ పేరు పెట్టింది. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ – వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ప్రభుత్వ నినాదంలో భాగంగా ‘నాసా’ ఈ మిషన్ చేపడుతుండగా.. తాజా బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘అందరికీ సమన్యాయం’ అన్న నినాదం మేరకు మహిళతో పాటు శ్వేత జాతేతర వ్యక్తిని చంద్రుడి ఉపరితలానికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్ స్టీవ్ జుర్సిక్ అధికారిక ప్రకటన చేశారు. కాగా మూన్‌పైకి మనిషిని తీసుకెళ్లిన యూఎస్ ఫస్ట్ మిషన్ ‘అపోలో’కు కవల సోదరిగా పరిశీలకులు ఈ ‘ఆర్టెమిస్’ను అభివర్ణిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఈ మిషన్‌లో పాల్గొనే 18 మంది ఆస్ట్రోనాట్లను ‘నాసా’ పరిచయం చేసింది. ఇందులో 9 మంది మహిళలతోపాటు కొందరు శ్వేతజాతేతర వ్యక్తులు కూడా ఉన్నారు. కాగా సదరు మహిళ, శ్వేతజాతేతర వ్యక్తి ఎవరు? అనే విషయం ఇంకా వెల్లడించలేదు. ఇక ఆర్టెమిస్ ఆస్ట్రోనాట్స్ తొలి గ్రూపులో భారత సంతతికి చెందిన రాజాచారి ఉండటం విశేషం.