ఏపీలో జీతాలు ఇవ్వలేని దుస్థితి – నర్సాపురం ఎంపీ 

by srinivas |
raghurama krishnam raju,
X

దిశ, వెబ్ డెస్క్: అధికార పార్టీ విధానాలను నర్సాపురం యూశ్రారైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు కూడా ఇవ్వలేని స్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో రాజధాని మార్పు సరికాదు. ప్రభుత్వం మారినప్పుడుల్లా రాజధాని మార్చుకుంటూపోతే బాగోదని హితవు పలికారు.

అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారు. దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని ఆయన కోరారు. అమరావతి నిర్మాణానికి ఎంత ఖర్చు చేశారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు కోరడం మంచి పరిణామం అని అభిప్రాయపడ్డారు. రాజధాని వ్యవహారంపై రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.

న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం ప్రభుత్వానికే నష్టం. దూరదృష్టి లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్‌ లాంటి వ్యక్తిని బెదిరించడం సరికాదన్నారు. నన్ను కూడా చాలాసార్లు బెదిరించారంటూ గుర్తుచేశారు.

Advertisement

Next Story

Most Viewed