ఆఫర్‌పై స్పందిస్తే చర్చలకు రెడీ: నరేంద్ర సింగ్ తోమర్

by Shamantha N |
ఆఫర్‌పై స్పందిస్తే చర్చలకు రెడీ: నరేంద్ర సింగ్ తోమర్
X

న్యూఢిల్లీ: రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నదని, దానికి ముందు వారు కేంద్రం ఇచ్చిన ఆఫర్‌పై స్పందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. సాగు చట్టాలను ఏడాదిన్నర నిలిపేసి ఆ కాలంలో ఒక జాయింట్ కమిటీతో సమస్యను పరిష్కరించుకునే ప్రతిపాదనను గతంలో కేంద్రం రైతులకు సూచించిన సంగతి తెలిసిందే. ముందు ఈ ప్రతిపాదనపై రైతు సంఘాలు స్పందించాలని, అటు తర్వాతే చర్చలు జరపడానికి సిద్ధమని కేంద్ర మంత్రి వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులు, సాగు ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నదని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కృషి చేస్తున్నదని అన్నారు. సాగు చట్టాలను రద్దు చేయకుంటే 40 లక్షల ట్రాక్టర్‌లతో పార్లమెంటుకు మార్చ్ చేస్తామన్న రైతు నేత రాకేశ్ తికాయత్ వ్యాఖ్యలపై స్పందన కోరగా, రైతులతో సామరస్యపూర్వకంగా కేంద్రం చర్చలు జరుపుతూనే ఉన్నదని తెలిపారు. రైతు సంఘాల స్పందన రాగానే మళ్లీ చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు.

Advertisement

Next Story