భారత బాక్సింగ్ టీమ్ హెడ్‌కోచ్‌గా నరేందర్ రాణా

by Shyam |
Boxing1
X

దిశ, స్పోర్ట్స్: భారత పురుషుల బాక్సింగ్ చీఫ్ కోచ్‌గా నరేందర్ రాణాను నియమిస్తూ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) నిర్ణయం తీసుకున్నది. ఈ నెలలో బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు కోచ్ పదవిలో ఉన్న సీఏ కట్టప్ప స్థానంలో ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నరేందర్ రాణాకు పదవీ బాధ్యతలు అప్పగించింది. సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్‌లో ఎంతో అనుభవజ్ఞుడైన కోచ్‌గా పేరున్న నరేందర్ రాణా.. ఏసియన్ ఛాంపియన్‌షిప్‌‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. అంతేకాకుండా నాలుగు సార్లు జాతీయ ఛాంపియన్‌గా కూడా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన అమిత్ పంగల్, మనీశ్ కౌశిక్‌లకు శిక్షణ అందించిన అనుభవం నరేందర్ రాణా సొంతం. పూణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో చాలా కాలంగా పని చేస్తున్నారు. అప్పుడే సురన్‌జోయ్ సింగ్, వికాశ్ క్రిష్ణన్, శివ థాప, దేవేంద్రో సింగ్ వంటి బాక్సర్లను గుర్తించి శిక్షణ ఇచ్చాడు. ‘నరేందర్ రాణా హెడ్ కోచ్ బాధ్యతలు చేపడతారు. ఇకపై నేను భారత బాక్సింగ్ కోచింగ్ స్టాఫ్‌లో ఒకడిగా మాత్రమే ఉంటాను’ అని కట్టప్ప మీడియాకు తెలిపారు.

Advertisement

Next Story