కరోనాతో కలెక్టర్ పర్సనల్ సెక్రెటరీ మృతి

by vinod kumar |
Narayanarao
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కరోనాతో నారాయణపేట కలెక్టర్ హరిచందన పర్సనల్ సెక్రెటరీ ఎంబి నారాయణ రావు ( 53 ) గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. గత 12 రోజుల క్రితం ఆయన తల్లి అనారోగ్యం పాలుకావడంతో తన సొంతూరైన జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్లకల్ మండల కేంద్రానికి చేరుకున్నాడు. ఉగాది పండుగ తర్వాత అస్వస్థతకు గురైన నారాయణరావు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో కరోనా పాజిటివ్ అని తేలింది.

వారం రోజులు మహబూబ్ నగర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందిన నారాయణరావు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నారాయణరావు మృతి పట్ల కలెక్టర్ హరిచందన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story